రాజకీయాలు
KTR : రాహుల్ కుర్చీలోని టిష్యూను రేవంత్ రెడ్డి తీస్తున్నాడు : కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అబద్ధపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నేతలు రాగానే గజగజ వణుకుతున్నాడని విమర్శించారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రియాంక గాంధీ రాగానే ఆమె బాడీ గార్డులు రేవంత్ రెడ్డిని నూకేస్తారు. వాడు చిన్నగా ఉన్నా కూడా మా ముఖ్యమంత్రి.. వాడిని నూకేయకండి’అని అన్నారు.
