రాజకీయాలు

MP Etala : కేసీఆర్‌ను బోనులో నిలబెట్టబోయి రైతులను నిలబెట్టిన రేవంత్ రెడ్డి : ఎంపీ ఈటల

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను బోనులో నిలబెట్టబోయి సీఎం రేవంత్ రైతులను బోనులో నిలబెట్టారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉండగా ఈ ప్రాంతానికి కరువు రాదని ఎప్పుడో చెప్పాడని, ప్రాణహిత నుంచి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని చెప్పారు. 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయన్న భ్రమల్లో రేవంత్ రెడ్డి ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి మరో 15 ఏళ్ల పాటు అధికారం రాదంటున్నది ఆ పార్టీ కార్యకర్తలే అని విమర్శించారు. ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు.