తెలంగాణ

Revanth reddy : నేడు సిద్దిపేటకు రేవంత్ రెడ్డి.. 25 సెగ్మెంట్స్ భారీగా జనసమీకరణ!

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిద్దిపేటలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన అక్కడకు చేరుకుంటారని తెలిసింది. హెలికాప్టర్ ద్వారా సిద్దిపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇదే వేదికగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నేడు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు.అంతేకాకుండా లబ్ధిదారులకు చేయూత పింఛన్లు, మహిళలకు ఇందిరమ్మ చీరలను సైతం ఇదే వేదికగా పంపిణీ చేయాల్సి ఉండగా, అది కాస్త ఈనెల 26కు వాయిదా పడినట్టు సమాచారం. ఇక సంక్షేమ పథకాల ప్రారంభానికి ముందు జిల్లాలో రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పటికే అభివృద్ధి పూర్తయిన వాటిని ప్రారంభించనున్నారు.