రాజకీయాలు

Chinnareddy : రేవంత్ అవినీతి రూ. లక్ష కోట్లు దాటింది.. సోనియాకు చిన్నారెడ్డి లేఖ!

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు క్రమంగా పెరుగుతున్నాయి. సీఎం రేవంత్ ప్రభుత్వంపై ఓవైపు ఎమ్మెల్యేలు,మరోవైపు పార్టీని అంటి పెట్టుకుని ఎంతో కాలంగా ఉంటున్న సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. కొందరు మంత్రి పదవులు దక్కలేదని, మరికొందరు పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, అధికారులు,నేతలు ఎవరూ తమ మాట వినడం లేదని అసంతృప్తి రాగాన్ని పెంచుతున్నారు. నేతలు నోరుజారొద్దని టీపీసీసీ, ఏఐసీసీ ఎన్నిమార్లు హెచ్చరికలు పంపినా అధికార పార్టీ నేతలు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి, తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన పూర్తి వివరాలతో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖరాసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి రూ.లక్ష కోట్లు దాటిందని సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయడం సొంత పార్టీలోనే కలకలం రేపింది.