ఏపీ

AP : కిలో కందిపప్పు రూ.100, పామాయిల్ రూ.125 .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సబ్సిడీపై అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బియ్యం ధరల కట్టడికి చర్యలు చేపట్టిన కూటమి సర్కార్..ఔట్‌లెట్స్ ద్వారా సబ్సిడీపై సన్నబియ్యం అందిస్తోంది. దీనికి తోడు పప్పులు, నూనె సైతం అందించేందుకు తాజాగా నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు దారులు వీటిని తీసుకోవడానికి అర్హులు..బుధవారం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు కందిపప్పు, పామాయిల్ పంపిణీని ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు కిలో కందిపప్పును రూ. 100కు, లీటర్ పామాయిల్‌ను రూ. 125కు అందించాలని సీఎం ఆదేశించారు.