సినిమా

Salman Khan: మన టాలీవుడ్‌లో ఈ స్టార్స్ అడిగితే సల్మాన్ రెడీ అంటున్నాడు..

Salman Khan: మన టాలీవుడ్ స్టార్ హీరోలకి బాలీవుడ్ స్టార్స్‌తో మంచి అనుబంధం ఉంటుంది. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌తో నాగార్జునకి, సల్మాన్ ఖాన్‌తో మెగా ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉంది. అందుకే, అక్కినేని నాగ చైతన్య ఆమిర్ ఖాన్‌ నటించిన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి మెగా హీరోలంటే ఎంతో ఇష్టం. తాజాగా, ఆయన మన టాలీవుడ్ స్టార్స్ అడిగితే నేను కామియో చేయడానికి ఎప్పుడూ రెడీ అని చెప్పాడు.