సినిమా

Salman Khan: మన టాలీవుడ్‌లో ఈ స్టార్స్ అడిగితే సల్మాన్ రెడీ అంటున్నాడు..

Salman Khan: మన టాలీవుడ్ స్టార్ హీరోలకి బాలీవుడ్ స్టార్స్‌తో మంచి అనుబంధం ఉంటుంది. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌తో నాగార్జునకి, సల్మాన్ ఖాన్‌తో మెగా ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉంది. అందుకే, అక్కినేని నాగ చైతన్య ఆమిర్ ఖాన్‌ నటించిన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి మెగా హీరోలంటే ఎంతో ఇష్టం. తాజాగా, ఆయన మన టాలీవుడ్ స్టార్స్ అడిగితే నేను కామియో చేయడానికి ఎప్పుడూ రెడీ అని చెప్పాడు.

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, తారక్..వీరు ఎప్పుడు తనని కామియో రోల్ చేయమని అడిగినా వెంటనే ఒప్పుకుంటానని సల్మాన్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో గెస్ట్ రోల్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. ఇక్కడ, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ముంబైలో షూటింగ్ జరిగినన్నిరోజులు చిరుకు ప్రత్యేకంగా అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నాడు. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట.

ఇక, చరణ్..వెంకటేష్..తారక్‌లతోను సల్లు భాయ్ ఎంతో సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వీరితో కలిసి సల్మాన్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంది. స్వయంగా, ఆయనే ఈ విషయం చెప్పాడు కాబట్టి అలా, గెస్ట్ రోల్ రాయడం మన వాళ్ళమీదే ఆధారపడి ఉంది. తారక్, హిందీలో హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన డెబ్యూ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

ఇక, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. 2027లో రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు-వంశీ పైడిపల్లిలతో పాటు సల్మాన్ ఖాన్‌కి కూడా ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారింది.

తర్వాత చదవండి