Animal Park: వివాదాస్పద మూవీ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా.. అవసరమా బ్రో?
Animal Park: తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడుతున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో సందీప్ ఓపెన్‌గా చెప్పేశారు. ప్రభాస్‌తో చేస్తున్న 'స్పిరిట్' సినిమా పనులు పూర్తయిన వెంటనే, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో క్రేజీ సీక్వెల్ 'యానిమల్ పార్క్' మొదలుపెట్టబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చేశారు.అయితే సందీప్ ఈ ప్రకటన చేయగానే సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. గతంలో వచ్చిన 'యానిమల్' సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు కొట్టినా, ఆ సినిమాపై అప్పట్లో గట్టిగానే విమర్శలు వచ్చాయి. ఓవర్ వైలెన్స్, బూతులు, ఆడవాళ్లను తక్కువ చేసి చూపించే సీన్లు ఉన్నాయంటూ చాలా మంది ఫైర్ అయ్యారు. ఇప్పుడైనా సందీప్ తన స్టైల్ మార్చుకుంటారని అనుకుంటే, మళ్లీ అదే వివాదాస్పద సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేయడంతో జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
