సినిమా

Animal Park: వివాదాస్పద మూవీ ప్రకటించిన సందీప్‌ రెడ్డి వంగా.. అవసరమా బ్రో?

Animal Park: తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడుతున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో సందీప్ ఓపెన్‌గా చెప్పేశారు. ప్రభాస్‌తో చేస్తున్న 'స్పిరిట్' సినిమా పనులు పూర్తయిన వెంటనే, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో క్రేజీ సీక్వెల్ 'యానిమల్ పార్క్' మొదలుపెట్టబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

అయితే సందీప్ ఈ ప్రకటన చేయగానే సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. గతంలో వచ్చిన 'యానిమల్' సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు కొట్టినా, ఆ సినిమాపై అప్పట్లో గట్టిగానే విమర్శలు వచ్చాయి. ఓవర్ వైలెన్స్, బూతులు, ఆడవాళ్లను తక్కువ చేసి చూపించే సీన్లు ఉన్నాయంటూ చాలా మంది ఫైర్ అయ్యారు. ఇప్పుడైనా సందీప్ తన స్టైల్ మార్చుకుంటారని అనుకుంటే, మళ్లీ అదే వివాదాస్పద సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేయడంతో జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

ఇప్పటికే 'యానిమల్' పార్ట్-1లోనే రక్తపాతం, అడల్ట్ కంటెంట్ పీక్స్‌లో ఉన్నాయని చాలా మంది తప్పుబట్టారు. అలాంటిది 'యానిమల్ పార్క్' ఇంకా ఎంత వైలెంట్‌గా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మరో వర్గం మాత్రం "మళ్లీ అంతే స్థాయిలో బూతులు, వైలెన్స్ ఉన్న సినిమా అవసరమా బ్రో?" అంటూ సోషల్ మీడియాలో నేరుగా అడుగుతున్నారు. మరి ఈ విమర్శల మధ్య సందీప్ రెడ్డి వంగా 'యానిమల్ పార్క్'ను ఏ రేంజ్‌లో తీస్తారో చూడాలి.

తర్వాత చదవండి