టాప్ న్యూస్
WhatsApp : వాట్సాప్లో ‘షెడ్యూల్డ్ మెసేజెస్’ఫీచర్.. తెగవాడేస్తున్న యూజర్లు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.చాలా మంది వాట్సాప్ స్టేటస్లను శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ చెప్పడానికి వినియోగిస్తుంటారు. ఇంతకాలం అది కేవలం యూజర్ గుర్తుంచుకుని పెడితేనే అది కనిపించేంది. తీరా విషెస్ తెలపాల్సిన సమయంలో మరిచిపోతే కష్టం. కానీ, ఇప్పుడు వాట్సాప్లో షెడ్యూల్డ్ మెసేజెస్ (Scheduled Messages) ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమకు కావాల్సిన మెసేజ్లను ముందుగానే టైప్ చేసి, నిర్దిష్ట తేదీ, సమయానికి ఆటోమేటిక్గా వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు.దీంతో ముఖ్యమైన సందర్భాలను మర్చిపోయే సమస్యకు పరిష్కారం లభించనుంది.
