ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లను శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ చెప్పడానికి వినియోగిస్తుంటారు. ఇంతకాలం అది కేవలం యూజర్ గుర్తుంచుకుని పెడితేనే అది కనిపించేంది. తీరా విషెస్ తెలపాల్సిన సమయంలో మరిచిపోతే కష్టం. కానీ, ఇప్పుడు వాట్సాప్‌లో షెడ్యూల్డ్ మెసేజెస్ (Scheduled Messages) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమకు కావాల్సిన మెసేజ్‌లను ముందుగానే టైప్ చేసి, నిర్దిష్ట తేదీ, సమయానికి ఆటోమేటిక్‌గా వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు.దీంతో ముఖ్యమైన సందర్భాలను మర్చిపోయే సమస్యకు పరిష్కారం లభించనుంది.
పెళ్లి రోజు, పుట్టినరోజు విషెస్..
రాత్రి 12 గంటలకు పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో సాయపడనుంది. ఆఫీస్ రిమైండర్లు, చెల్లింపుల వివరాలు లేదా ప్రత్యేక పండుగ సందేశాలను ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవచ్చు.గతంలో ఇలాంటి అవసరాల కోసం థర్డ్-పార్టీ యాప్‌ల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాట్సాప్‌లోనే ఈ సదుపాయం లభించడంతో యూజర్ల డేటాకు మరింత భద్రత చేకూరనుంది.
వాట్సాప్ సరికొత్త ఫీచర్ పనిచేసే విధానం కూడా చాలా సులభంగా ఉంటుందని తెలుస్తోంది. వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్‌లో మెసేజ్ టైప్ చేసిన తర్వాత, సెండ్ (Send) బటన్‌ను కాసేపు నొక్కి పట్టుకోవడం (Long Press) లేదా చాట్ మెనూలోని 'షెడ్యూల్ మెసేజ్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా తేదీ, సమయాన్ని సెట్ చేసుకోవచ్చుని తెలుస్తోంది. నిర్ణీత సమయం రాగానే ఆ మెసేజ్ అవతలి వారికి ఆటోమేటిక్‌గా డెలివరీ అవుతుంది. దీంతో యూజర్‌కు అదే రోజున విషెస్ చెప్పాలి. గ్రీటింగ్ సెండ్ చేయాలనే ఒక టెన్షన్ తప్పనుంది.
షెడ్యూల్ చేసిన మెసేజ్‌లను పంపడానికి ముందే యూజర్లు వాటిని ఎడిట్ చేసుకునే సౌకర్యం కూడా కొత్త ఫీచర్లో అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. అవసరమైతే పూర్తిగా డిలీట్ చేసే వెసులుబాటు కూడా కల్పించినట్టు సమాచారం. తప్రస్తుతం దశలవారీగా బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తున్న ఈ ఫీచర్, త్వరలోనే ఆండ్రాయిడ్ , ఐఓఎస్ వినియోగదారులందరికీ పూర్తిస్థాయిలో లభించనుందని తెలుస్తోంది.షెడ్యూల్ మెసేజెస్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలిసి యూజర్లు దాని గురించి తెర వెతుకుతున్నట్టు తెలుస్తోంది.
