తెలంగాణ
‘రాజీవ్‌ను చంపాలనే సెక్యూరిటీని తొలగించారు’.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి ఆయన భార్య, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు గురికావాలనే దురుద్దేశంతోనే అప్పట్లో ఆయనకు కల్పించిన భద్రతను తొలగించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం గురించి తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి ముచ్చటించిన ప్రత్యేక వీడియోను సోనియా గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (X) వేదికగా పంచుకున్నారు.
