తెలంగాణ

TG: షాద్‌నగర్‌లో భారీ భూ స్కామ్.. నకిలీ సర్వే మ్యాప్‌తో అక్రమ రిజిస్ట్రేషన్!

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో వెలుగుచూసిన ఓ భూ రిజిస్ట్రేషన్ స్కామ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా ప్రభుత్వ సర్వే రికార్డులనే తారుమారు చేసి, నకిలీ సర్వే మ్యాప్ సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారం బట్టబయలైంది. ఫరూక్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ నాసా దీపక్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. నందిగామ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 618లో ఉన్న ఎకరం 2.10 గుంటల భూమికి సంబంధించి 2026 అక్టోబర్ 16న రెక్టిఫికేషన్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ సమయంలో నందిగామ మండల సర్వేయర్ జారీ చేసినట్లుగా ఒక సర్వే మ్యాప్, రిపోర్టును అధికారులకు సమర్పించారు.