National
Technews Today Nov 28: ఓపెన్ఏఐ కౌంటర్ దావా, 22శాతం తగ్గిన ఫోన్ల అమ్మకాలు: నవంబర్ 28 టెక్ విశేషాలివే!
వ్యాపార రహస్యాల వివాదంలో ఆపిల్‌పై OpenAI కౌంటర్ దావా వేయగా, ColorOS 17లోని మూడు కీలక AI ఫీచర్లకు నెలవారీ ఛార్జీలు వసూలు చేసే దిశగా Oppo యోచిస్తోంది. గ్యాడ్జెట్ల విభాగంలో కంటెంట్ క్రియేటర్ల కోసం రూ.4,99,990 ధరతో ASUS ProArt P16 ల్యాప్‌టాప్ భారత్‌లో విడుదల కాగా, టీనేజర్ల భద్రత కోసం X (ట్విట్టర్) కొత్త పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను తీసుకొచ్చింది. ఇక మెమొరీ చిప్‌ల ధరల పెరుగుదల వల్ల పండుగ సీజన్లో దేశీయ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 22 శాతం తగ్గగా, తెలంగాణలో రూ.2,500 కోట్లతో 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు.
