టెక్ దిగ్గజాలు OpenAI, Apple మధ్య న్యాయపోరాటం మరింత ముదిరింది. వ్యాపార రహస్యాలు (trade secrets), ఉద్యోగుల అంశంలో ఆపిల్ తమ హక్కులను ఉల్లంఘించిందంటూ ఓపెన్ఏఐ కౌంటర్ దావా వేసింది. మరోవైపు, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి పిల్లల భద్రతా కారణాల రీత్యా చైనా సంస్థ MiniMaxకు చెందిన 'Talkie' AI చాట్‌బాట్ యాప్‌ను తొలగించింది. అదేవిధంగా ఈరోజు మరిన్ని టెక్ విశేషాలు మీకోసం..

Oppo తమ ColorOS 17లో ఏఐ ఫీచర్లు
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo తమ ColorOS 17లో ఉన్న లైవ్ ట్రాన్స్లేషన్, AI ఫొటో ఏజెంట్, ట్రాన్స్క్రిప్షన్ వంటి మూడు AI ఫీచర్లకు నెలవారీ క్రెడిట్ ఆధారిత సబ్స్క్రిప్షన్ (భారత్‌లో రూ.289 నుంచి ప్రారంభం) ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు టెక్ నివేదికలు పేర్కొంటున్నాయి.

గేమింగ్, AI డెవలపర్ల కోసం.. భారత్‌లో ASUS ProArt P16 లాంచ్
కంటెంట్ క్రియేటర్లు, AI డెవలపర్ల కోసం ASUS తమ శక్తివంతమైన ProArt P16 ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదల చేసింది. 16-అంగుళాల 4K OLED టచ్ డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్), ఎన్విడియా (Nvidia) RTX Spark N1X ప్లాట్‌ఫామ్, Wi-Fi 7 వంటి హై-ఎండ్ ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ ధరను రూ.4,99,990గా నిర్ణయించారు. అటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) 13–17 ఏళ్ల టీనేజర్ల ఖాతాలను తల్లిదండ్రులు పర్యవేక్షించేలా కొత్త పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను ప్రవేశపెట్టింది.

పండుగ సీజన్లో 22శాతం తగ్గిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో ఫోన్ల రేట్లు భారమయ్యాయని, ఫలితంగా 2026 పండుగ సీజన్లో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 22 శాతం తగ్గాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ (Counterpoint Research) వెల్లడించింది.

తెలంగాణలో 65 ఐటీఐల అప్‌గ్రేడ్
తెలంగాణలో సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు రూ.2,500 కోట్ల పెట్టుబడితో 65 ఐటీఐలను (ITIs) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATC) ఆధునీకరిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్మండలం లింగారెడ్డిగూడలో శుక్రవారం కళాశాల, స్కూల్ భవన నిర్మాణాల భూమిపూజలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే దేశంలో AI ఇన్ఫరెన్స్ అవసరాల కోసం జాతీయ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను కేంద్ర ఐటీ శాఖ (MeitY) పరిశీలిస్తోంది.
