TechUpdates: స్మార్ట్ఫోన్ ధరలు తగ్గుతాయా? లేటెస్ట్ టెక్ అప్డేట్స్ ఇవే!
టెక్ రంగంలో రోజుకో కొత్త అప్డేట్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల స్మార్ట్ ఫోన్ల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్న వారు నిరాశలో ఉన్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి? ప్రస్తుతం మార్కెట్లో ఫోన్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయో లేదో చూద్దాం.
మొబైల్ ధరలు తగ్గుతాయా?
ప్రస్తుతం మొబైల్ ధరలు తగ్గుతాయా లేదా అనేది చాలామందిలో ఉన్న ప్రధాన సందేహం. తాజా నివేదికల ప్రకారం 2027 రెండో త్రైమాసికం (Q2 - ఏప్రిల్, మే, జూన్) నాటికి RAM, ROM ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కొత్తగా వస్తున్న చిప్ తయారీ సంస్థల వల్ల ప్రస్తుతం ఉన్న చిప్ కొరత, అధిక డిమాండ్ చాలావరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. చిప్ షార్టేజ్ సమస్య పరిష్కారమైతే సహజంగానే ధరలు తగ్గే దిశగా వెళ్తాయి. అయితే గతంలో పెరిగిన ధరలకు వినియోగదారులు అలవాటు పడ్డారు కాబట్టి, ధరలు పూర్తిగా పాత సాధారణ స్థాయికి వస్తాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత ధరలనే కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అదేవిధంగా సామ్సంగ్, గూగుల్, ఆపిల్, ఇన్స్టాగ్రామ్, మోటోరోలా, పేటీఎం, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల నుంచి వచ్చిన తాజా వార్తలు, ఆఫర్లు, ఫీచర్ల వివరాల కోసం డబుల్ క్లిక్ చేయండి.
