వ్యాపారం

TechUpdates: స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గుతాయా? లేటెస్ట్ టెక్ అప్‌డేట్స్ ఇవే!

టెక్ రంగంలో రోజుకో కొత్త అప్‌డేట్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల స్మార్ట్ ఫోన్ల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్న వారు నిరాశలో ఉన్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి? ప్రస్తుతం మార్కెట్‌లో ఫోన్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయో లేదో చూద్దాం. అదేవిధంగా సామ్‌సంగ్, గూగుల్, ఆపిల్, ఇన్‌స్టాగ్రామ్, మోటోరోలా, పేటీఎం, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల నుంచి వచ్చిన తాజా వార్తలు, ఆఫర్లు, ఫీచర్ల వివరాలు మీకోసం..

టెక్ రంగంలో రోజుకో కొత్త అప్‌డేట్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల స్మార్ట్ ఫోన్ల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్న వారు నిరాశలో ఉన్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి? ప్రస్తుతం మార్కెట్‌లో ఫోన్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయో లేదో చూద్దాం. అదేవిధంగా సామ్‌సంగ్, గూగుల్, ఆపిల్, ఇన్‌స్టాగ్రామ్, మోటోరోలా, పేటీఎం, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల నుంచి వచ్చిన తాజా వార్తలు, ఆఫర్లు, ఫీచర్ల వివరాలు మీకోసం..

 మొబైల్ ధరలు తగ్గుతాయా?

ప్రస్తుతం మొబైల్ ధరలు తగ్గుతాయా లేదా అనేది చాలామందిలో ఉన్న ప్రధాన సందేహం. తాజా నివేదికల ప్రకారం 2027 రెండో త్రైమాసికం (Q2 - ఏప్రిల్, మే, జూన్) నాటికి RAM, ROM ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కొత్తగా వస్తున్న చిప్ తయారీ సంస్థల వల్ల ప్రస్తుతం ఉన్న చిప్ కొరత, అధిక డిమాండ్ చాలావరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. చిప్ షార్టేజ్ సమస్య పరిష్కారమైతే సహజంగానే ధరలు తగ్గే దిశగా వెళ్తాయి. అయితే గతంలో పెరిగిన ధరలకు వినియోగదారులు అలవాటు పడ్డారు కాబట్టి, ధరలు పూర్తిగా పాత సాధారణ స్థాయికి వస్తాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత ధరలనే కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

 మరోవైపు, IDC క్వార్టర్ 3 (2026) నివేదిక ప్రకారం.. 2025 క్వార్టర్ 3తో పోలిస్తే భారత మార్కెట్ సుమారు 24శాతం పడిపోయింది. ఈ ప్రభావం ఒక్క బ్రాండ్‌కే కాకుండా దాదాపు అన్ని కంపెనీలపై పడింది. కొన్ని బ్రాండ్ల మార్కెట్ 30 నుంచి 35 శాతం వరకు క్షీణించగా, ముఖ్యంగా రియల్‌మీ (Realme), షియోమీ (Xiaomi) వంటి బ్రాండ్లపై భారీ ప్రభావం కనిపించింది. ఆపిల్ (Apple), సామ్‌సంగ్ (Samsung) కొంతవరకు నిలదొక్కుకుంటున్నా, మొత్తం మీద బడ్జెట్, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌కే ఎక్కువ దెబ్బ తగిలింది. సర్వే గణాంకాల ప్రకారం 100డాలర్ల లోపు ఫోన్ల మార్కెట్ దాదాపు 90 శాతం పడిపోగా, 100డాలర్ల నుంచి 200డాలర్ల మధ్య ఫోన్ల మార్కెట్ సుమారు 29శాతం తగ్గింది. భారత్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే రూ.10,000, రూ.20,000 లోపు ఫోన్ల ధరలు పెరగడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా నిలిచింది.

 అమెజాన్‌లో సామ్‌సంగ్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. GaN టెక్నాలజీతో కూడిన సామ్‌సంగ్ ఒరిజినల్ 60W పవర్ అడాప్టర్ కేవలం రూ.850 ధరకు లభిస్తోంది (ఇందులో కేబుల్ ఉండదు). USB PD 3.1, PPS సపోర్ట్ ఉన్న ఈ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, USB-C ల్యాప్‌టాప్‌లను వేగంగా ఛార్జ్ చేయవచ్చు. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0సాయంతో గెలాక్సీ S26 అల్ట్రా వంటి ఫోన్లను 30 నిమిషాల్లోనే 75 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

మరోవైపు, సామ్‌సంగ్ 2026 ఎడిషన్ 65-అంగుళాల క్రిస్టల్ UHD 4K విజన్ AI స్మార్ట్ టీవీ (UA65UE85AHULXL) డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో రూ.68,990 ధరకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. క్రిస్టల్ ప్రాసెసర్ 4K, HDR10+, 30W స్పీకర్లు, విజన్ AI కంపానియన్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Tizen OSపై పనిచేసే ఈ టీవీకి 7 ఏళ్ల పాటు OS అప్‌గ్రేడ్‌లతో పాటు సామ్‌సంగ్ టీవీ ప్లస్ ద్వారా 150కి పైగా ఉచిత ఛానెల్‌ల సదుపాయం లభిస్తుంది.

 సామ్‌సంగ్ One UI 9.5 బీటా: ఇండియాలో అందుబాటులోకి కొత్త ఫీచర్!

సామ్‌సంగ్ సంస్థ తమ One UI 9.5 బీటా ప్రోగ్రామ్‌ను పలు దేశాలతో పాటు మన దేశంలోనూ ప్రారంభించింది. ఇప్పటివరకు సామ్‌సంగ్ విడుదల చేసిన అతిపెద్ద అప్‌డేట్‌లలో ఇదొకటిగా నిలుస్తోంది. ఇందులో యూజర్ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచారు.

ఈ అప్‌డేట్‌లో నేటివ్ యాప్ లాక్ సపోర్ట్‌తో పాటు, UIలోని అనేక ఫీచర్లలో మార్పులు, చేర్పులు చేశారు. గేమింగ్ విభాగంలోనూ కొత్త అప్‌డేట్స్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ బీటా ప్రోగ్రామ్ సామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు సామ్‌సంగ్ మెంబర్స్ (Samsung Members) యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

 గూగుల్ జెమిని ఫీచర్లు ఫ్రీ: సబ్‌స్క్రిప్షన్ లేకుండానే మరిన్ని సేవలు

గూగుల్ జెమిని (Google Gemini) వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. గతంలో అడ్వాన్స్‌డ్‌గా భావించిన కొన్ని ఫీచర్లను, ముఖ్యంగా భారత్‌లో మరింత మందికి ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని పొందడానికి ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిన అవసరం లేదు.

బేస్ ప్లాన్‌లోనే సాధారణ ప్రశ్నలు, రెగ్యులర్ టాస్క్‌లతో పాటు హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ వంటి వాటికి సంబంధించిన సదుపాయాలు, అలాగే ఇంటర్నల్ మెయిల్, గూగుల్ యాప్స్, ఇతర ఇంటర్నల్ యాప్స్‌కు సంబంధించిన పనులను ఉచితంగా చేసే ఫీచర్లను అందించారు. వివిధ భాషల్లో ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, సబ్‌స్క్రిప్షన్ లేనివారు కూడా ఈ అప్‌డేట్లను చెక్ చేసుకోవచ్చని సమాచారం.

 మోటోరోలా Edge 70 Neo లాంచ్ వివరాలు, అంచనా ధర

మోటోరోలా సంస్థ తమ 'మోటోరోలా Edge 70 Neo' స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 24వ తేదీన లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగంలో వెనుకవైపు 50MP కెమెరా, ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాతో పాటు 7000mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ.30,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 ఇన్‌స్టాగ్రామ్ కొత్త నిబంధనలు, 'డైరెక్ట్' మెసేజింగ్ యాప్

ఇన్‌స్టాగ్రామ్ నుంచి రెండు కీలక అప్‌డేట్స్ వచ్చాయి. మొదటిది కంటెంట్ పాలసీకి సంబంధించింది. 18 ప్లస్ కంటెంట్‌ను ఎక్కువగా ప్రమోట్ చేసే, చూపించే లేదా అప్‌లోడ్ చేసే ఖాతాలపై కొత్త ఆంక్షలు విధించారు. హింసా*త్మక (viol*ence) కంటెంట్‌పై కూడా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. దీనివల్ల వినియోగదారుల ఫీడ్‌లో ఇలాంటి కంటెంట్ కనిపించే అవకాశం గణనీయంగా తగ్గుతుంది.

రెండోది, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అవసరం లేకుండానే చాట్ చేసుకునేలా 'డైరెక్ట్' (Direct) పేరుతో ప్రత్యేక మెసేజింగ్ యాప్‌ను తీసుకొచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో సంబంధం లేకుండా నేరుగా మెసేజ్‌లు పంపేలా దీన్ని రూపొందించారు. అయితే అకౌంట్ ఐడీ లేకుండా ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి. ప్రస్తుతం దీన్ని థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల్లో పరీక్షిస్తున్నారు; భారత్‌లో ఇంకా అధికారికంగా రాలేదు.

 ఆపిల్ మ్యాప్స్ 3D అప్‌డేట్, ఐఫోన్ డ్యూయో యాప్ ఆప్టిమైజేషన్

ఆపిల్ మ్యాప్స్ (Apple Maps) కోసం భారత్‌లో అన్ని భాషలకు సపోర్ట్ చేసేలా పెద్ద అప్‌డేట్ వచ్చింది. గూగుల్ మ్యాప్స్‌లో 3D నావిగేషన్ తరహాలోనే, ఇప్పుడు ఆపిల్ మ్యాప్స్‌లోనూ 3D ల్యాండ్‌మార్క్స్, కారులో వెళ్తున్నప్పుడు కనిపించే విజువల్స్, ఫ్లైఓవర్ల వివరాలతో కూడిన ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

మరోవైపు, ఆపిల్ ఐఫోన్ డ్యూయో (iPhone Duo) విషయానికి వస్తే, ప్రారంభంలో ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి కొన్ని ప్రముఖ యాప్‌లు మాత్రమే ఆ స్క్రీన్ రేషియోకు అనుగుణంగా ఆప్టిమైజ్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే 2 లక్షలకు పైగా అప్లికేషన్లలో ఆప్టిమైజేషన్ పూర్తి కావడంతో, ఐఫోన్ డ్యూయో యూజర్లకు ఎదురైన అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి.

బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓన్లీ ప్లాన్లు, పేటీఎం రూ.1 డేటా ఆఫర్

బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ఇతర టెలికాం సంస్థల తరహాలో వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 28 రోజుల వ్యాలిడిటీకి రూ.172, 30 రోజుల వ్యాలిడిటీకి రూ.190 ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో పేటీఎం (Paytm) యాప్‌లో ప్రత్యేక డేటా ఆఫర్ నడుస్తోంది. పేటీఎం రీఛార్జ్ విభాగంలో సంబంధిత కోడ్‌ల ద్వారా ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) వినియోగదారులకు రూ.1కే 1GB డేటా, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు రూ.1కే 2GB డేటా లభిస్తోంది. జియో (Jio) వినియోగదారులకు మాత్రం సంస్థ అందిస్తున్న రూ.15 అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ వంటి ఆఫర్లను పరిశీలించుకోవచ్చు.

తర్వాత చదవండి