Ethics Committee: ఐదు నెలలైనా అతీగతీ లేదు.. ఎథిక్స్ కమిటీ మౌనంపై పొలిటికల్ హీట్!
Ethics Committee: తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమిటీ ఏర్పాటై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా, విచారణ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై నివేదిక ఇవ్వడానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రెండోసారి పొడిగించిన గడువు కూడా ముగింపు దశకు చేరుకుంటున్నా, కమిటీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గత అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారంటూ అధికార పక్షం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈ వ్యవహారంపై విచారణ జరిపి మూడు నెలల్లోగా చర్యలకు సిఫారసు చేయాలని ఆదేశిస్తూ ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశారు.
