Telangana BJP: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనను బీజేపీ అటకెక్కించేసిందా?
Telangana BJP: వచ్చే మార్చిలో జరగబోయే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలంగాణ బీజేపీ తీరు ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. మిగతా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తుంటే.. కమలం పార్టీ మాత్రం ఎందుకు కాలయాపన చేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. మొదట్లో అందరికంటే ముందుంటామని హడావిడి చేసిన నాయకత్వం, ఇప్పుడు సడన్‌గా సైలెంట్ అవ్వడంతో అసలు అభ్యర్థుల ప్రకటనను అటకెక్కించేశారా అనే సందేహాలు కాషాయ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి.ఎన్నికల ప్రక్రియ మొదలైన కొత్తలో బీజేపీ పెద్దలు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ముహూర్తాలు కూడా చెప్పారు. అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక కమిటీలు వేయగా, ఆ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర అధ్యక్షుడికి రిపోర్టులు కూడా ఇచ్చేశాయి. ఆ తర్వాత ముఖ్య నేతల సమావేశం జరిపి, ప్రాబబుల్స్ లిస్ట్‌ను ఢిల్లీ అధిష్ఠానానికి పంపినట్లు ప్రచారం జరిగింది.
