Telangana BJP: కంచుకోటలు వదిలి వీక్ ఏరియాలపై కన్ను.. తెలంగాణ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఇదే!
Telangana BJP: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్ఠానం, రాష్ట్ర నేతల పనితీరుపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఇన్నాళ్లూ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే సభలు, సమావేశాలు పెడుతూ హడావుడి చేసిన నేతలకు ఢిల్లీ పెద్దలు తాజాగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్, కరీంనగర్ లాంటి కంచుకోటలను కాసేపు పక్కనపెట్టి.. పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో సత్తా చాటాలని ఆదేశించారు. దీంతో తెలంగాణ బీజేపీ ఇప్పుడు తన రూట్ మార్చి, వీక్ ఏరియాలను టార్గెట్ చేస్తూ కొత్త యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. కానీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో కమలం పార్టీ కనీసం డిపాజిట్ల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎదురైంది.
