తెలంగాణ
Telangana Congress : కాంగ్రెస్లో వీధికెక్కిన కుమ్ములాటలు.. ‘అలయ్ బలయ్’ సాక్షిగా బయటపడ్డ వర్గపోరు!
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి మధ్య కొంతకాలంగా నడుస్తున్న ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు బహిరంగ విమర్శలకు దారితీసింది. తాజాగా బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో ఆలేరులో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నియోజకవర్గంలోని వర్గపోరును బయటపెట్టింది.
