తెలంగాణ
Telangana Congress : మహిళా కోటా ఎఫెక్ట్.. తెలంగాణ రాజకీయాల్లో వారసుల ఎంట్రీ!
తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త వారసత్వ అధ్యాయానికి తెరలేవబోతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి 33 శాతం మహిళా కోటా అమల్లోకి వస్తే తమ సిట్టింగ్ సీట్లు చేజారిపోతాయన్న ఆందోళనలో ఉన్న మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు.. ఇప్పుడే ‘ఫ్యామిలీ ప్లాన్’ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
