చిత్రం లేదు
తెలంగాణ

Telangana Congress: కొండా సురేఖకు అలా.. రాజగోపాల్ రెడ్డికి ఇలా.. ఏంటిది రేవంత్?

Telangana Congress: అధికార కాంగ్రెస్ పార్టీలో ‘క్రమశిక్షణ’ అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మాజీ మంత్రి కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న కఠిన నిర్ణయాన్ని, తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలను పోలుస్తూ గాంధీ భవన్ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ లైన్ దాటితే అందరికీ ఒకే రకమైన రూల్స్ వర్తిస్తాయా? లేక ఒక్కో నేతకు ఒక్కో న్యాయం ఉంటుందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.గత సెప్టెంబర్‌లో తన కుమార్తె సుస్మిత పటేల్, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన బహిరంగ విమర్శల వ్యవహారం కొండా సురేఖ పదవికి ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే.