తెలంగాణ

TG: చిరిగిపోదు, తడిసినా పాడవదు.. తెలంగాణలో ఇక హైటెక్ పాస్ పుస్తకాలు!

TG: ఇన్నాళ్లూ వర్షంలో తడిసినా, ఇంట్లో భద్రంగా దాచుకోకపోయినా పాస్ పుస్తకాలు చిరిగిపోయి రైతులు నానా అవస్థలు పడేవారు. కానీ ఇకపై ఆ బాధలకు శాశ్వతంగా చెక్ పడబోతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, భూ యజమానులకు ఉచితంగా ‘వాటర్‌ప్రూఫ్’ హైటెక్ పాస్ పుస్తకాలను ఇవ్వబోతోంది. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రానున్న ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమిని కొలిచి, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన ప్రకటించారు.కొత్తగా ఇవ్వబోయే పాస్ పుస్తకాలు ఎంత వానలో తడిసినా పాడవకుండా, అస్సలు చిరిగిపోని విధంగా వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. వీటిపై ఉండే క్యూఆర్ కోడ్‌ను మీ మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఆ భూమి సర్వే నంబర్, విస్తీర్ణం, మ్యాప్ వివరాలన్నీ క్షణాల్లో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి