తెలంగాణ
తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల (IAS Transfers) బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను(Sarfaraz Ahmad) మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్ మెంట్ శాఖ (MAUD) కార్యదర్శిగా నియమించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించింది.
