తెలంగాణ

IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల (IAS Transfers) బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఐఏఎస్‌, నాన్‌ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల (IAS Transfers) బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్ లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఐఏఎస్‌, నాన్‌ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను(Sarfaraz Ahmad) మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్ మెంట్ శాఖ (MAUD) కార్యదర్శిగా నియమించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

సర్ఫరాజ్ స్థానంలో హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కొత్త కమిషనర్ గా ఈవీ నరసింహా రెడ్డికి (E.V. Narsimha Reddy) బాధ్యతలు అప్పగించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (Musi Riverfront Development Corporation) ఎండీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) ఎండీగా అజిత్ రెడ్డికి (Ajith Reddy) పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ, ఐ అండ్ సీ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అజిత్ రెడ్డి ఉన్నారు.

ప్రస్తుతం శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా ఉన్న చంద్రకళను (Chandrakala)అక్కడి నుంచి బదిలీ చేసి హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ స్పెషల్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఎండబ్ల్యూ ఎస్‌ఎస్‌బీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మయాంక్ మిట్టల్‌కు జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌ మనోజ్‌ను బదిలీ చేసి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. వరంగల్ స్టేట్ ఆడిట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్‌ రామును బదిలీ చేసి విద్యాశాఖలో స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా నియమించింది. ప్రస్తుతం విద్యాశాఖలో స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసిన ప్రభుత్వం.. తన మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు (Sanjay Jaju) ఉత్తర్వులు ఇచ్చారు.

మొత్తంగా మహానగర పరిధిలోని కీలక విభాగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పాలి. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల బాధ్యతల్లో మార్పులు చేసింది.

తర్వాత చదవండి