తెలంగాణ

TG: కారులో ఒంటరిగా వెళ్తే ఫైన్ పడుతుందా? తెలంగాణ పోలీసుల క్లారిటీ ఇదే!

కారులో ఒంటరిగా ప్రయాణిస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేస్తారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కొత్త రూల్ ఏమైనా తీసుకొస్తోందా అని కారు ఓనర్లందరిలో ఒకటే టెన్షన్ మొదలైంది. అయితే, ఈ ప్రచారంపై తెలంగాణ పోలీసులు తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఒట్టి ప్రచారాలే అని, అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. పోలీసుల వివరణతో తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా అధికారిక పోస్ట్ పెట్టింది.