తెలంగాణ

Telangana Politics: కాంగ్రెస్‌ను కొట్టేందుకు కారు, కమలం కొత్త స్కెచ్? పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిపక్షాల కొత్త ప్లాన్ నిజమేనా!

Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, అంతకంటే ముందే జరగనున్న స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న సురభి వాణిదేవి, తీన్మార్ మల్లన్న స్థానాలకు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి అవగాహన కుదిరిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పట్టభద్రులను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాల్లో పరస్పరం సహకరించుకునేలా ఆ రెండు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.