తెలంగాణ
TG: తెలంగాణ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. కేసులు తప్పవు!
TG: తెలంగాణలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. తమపై నమోదైన క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. డిఫాల్ట్ అయిన మిల్లర్లపై ఫైల్ అయిన ఎఫ్ఐఆర్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో, ఇక వారికి విచారణ తప్పదని తేలిపోయింది. న్యాయస్థానం కఠిన వైఖరితో మిల్లర్ల తరఫు న్యాయవాదులు వెనక్కి తగ్గి, పిటిషన్లను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టిన మిల్లర్లపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 540 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణను అడ్డుకోవాలని, ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ మిల్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
