తెలంగాణ

TG: తెలంగాణ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. కేసులు తప్పవు!

TG: తెలంగాణలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. తమపై నమోదైన క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. డిఫాల్ట్ అయిన మిల్లర్లపై ఫైల్ అయిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో, ఇక వారికి విచారణ తప్పదని తేలిపోయింది.

TG: తెలంగాణలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. తమపై నమోదైన క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. డిఫాల్ట్ అయిన మిల్లర్లపై ఫైల్ అయిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో, ఇక వారికి విచారణ తప్పదని తేలిపోయింది. న్యాయస్థానం కఠిన వైఖరితో మిల్లర్ల తరఫు న్యాయవాదులు వెనక్కి తగ్గి, పిటిషన్లను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

540 ఎఫ్‌ఐఆర్‌లపై గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టిన మిల్లర్లపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 540 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణను అడ్డుకోవాలని, ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ మిల్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కేసుల రద్దుకు ససేమిరా అనడంతో పాటు, విచారణ కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. కోర్టు ఆగ్రహాన్ని గమనించిన పిటిషనర్లు గత్యంతరం లేక తమ పిటీషన్లను వెనక్కి తీసుకున్నారు.

బియ్యం ఇవ్వకపోతే బకాయిలు కట్టాల్సిందే..

కేవలం క్రిమినల్ కేసులకే పరిమితం కాకుండా, డబ్బు రికవరీపైనా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే అందుకు సమానమైన నగదు బకాయిలను చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.

రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగానికి సర్కార్ రెడీ

సుప్రీంకోర్టు తీర్పుతో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం లభించినట్లయింది. ఇప్పటికే బకాయిల వసూలు కోసం 'రెవెన్యూ రికవరీ యాక్ట్' కింద కఠిన చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఒకవైపు 540 కేసుల విచారణ, మరోవైపు ఆస్తుల రికవరీ చర్యలతో రాష్ట్రంలోని డిఫాల్ట్ రైస్ మిల్లర్లలో వణుకు మొదలైంది.

తర్వాత చదవండి