తెలంగాణ
TG: బీజేపీతో బీఆర్ఎస్ మాజీ మంత్రి మంతనాలు: సామ రామ్మోహన్ రెడ్డి
TG: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీకరణాలు వేడెక్కుతున్న వేళ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్కు చెందిన ఒక గ్రేటర్ మాజీ మంత్రి, బీజేపీ నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారంటూ ఆయన ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సామ రామ్మోహన్ రెడ్డి, ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రంగు మారుతున్న గులాబీ..? కాషాయం రంగు అద్దే పనిలో నారద ముని అవతారమెత్తిన గ్రేటర్ మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలతో రహస్య భేటీ మతలబేంటి..??"
