తెలంగాణ

TG: బీజేపీతో బీఆర్ఎస్ మాజీ మంత్రి మంతనాలు: సామ రామ్మోహన్ రెడ్డి

TG: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీకరణాలు వేడెక్కుతున్న వేళ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్‌కు చెందిన ఒక గ్రేటర్ మాజీ మంత్రి, బీజేపీ నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారంటూ ఆయన ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.

మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సామ రామ్మోహన్ రెడ్డి, ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రంగు మారుతున్న గులాబీ..? కాషాయం రంగు అద్దే పనిలో నారద ముని అవతారమెత్తిన గ్రేటర్ మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలతో రహస్య భేటీ మతలబేంటి..??" అంటూ ఆయన ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధికి చెందిన ఒక మాజీ మంత్రి బీఆర్ఎస్, బీజేపీలను దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా 'నారద ముని' పాత్ర పోషిస్తున్నారని రామ్మోహన్ రెడ్డి తన పోస్టులో పరోక్షంగా ఆరోపించారు. అయితే, ఆ మాజీ మంత్రి ఎవరు, ఏయే బీజేపీ నేతలతో ఎక్కడ భేటీ అయ్యారనే వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ వేడి..

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో స్వయంగా అభ్యర్థిగా ఉన్న రామ్మోహన్ రెడ్డి ఈ కామెంట్స్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ అవగాహన ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుండగా, అదంతా కేవలం కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ప్రచారం మాత్రమేనని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. తాజాగా గ్రేటర్ మాజీ మంత్రి రహస్య భేటీ అంటూ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై ఆయా పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

తర్వాత చదవండి