Apple store in Hyderabad : హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్.. ఎప్పుడు ప్రారంభమంటే?
హైదరాబాద్ వాసులకు ఆపిల్ (Apple) కంపెనీ శుభవార్త చెప్పింది.ఇంతకాలం ఆపిల్ ఉత్పత్తులను ఆన్‌లైన్, థర్డ్ పార్టీ స్టోర్స్ (బజాజ్ ఎలక్ట్రానిక్స్,రిలయన్స్,పై ఎలక్ట్రానిక్స్, టాటాక్రోమా)లో కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ఇకపై నేరుగా ఆపిల్ సొంత బ్రాంచిలోనే కొనుగోలు చేయొచ్చు. ఈ మేరకు నగరంలో ఆపిల్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భాగ్యనగరంలో తమ మొట్టమొదటి అధికారిక రిటైల్ స్టోర్‌ను 10 డిసెంబర్ 2026న ప్రారంభించనున్నట్లు ఆపిల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.హైదరాబాద్‌లోని ప్రధాన వాణిజ్య ప్రాంతమైన కూకట్‌పల్లిలో ఈ ప్రతిష్టాత్మక స్టోర్ కొలువుదీరనుంది.దీంతో ఆపిల్ వినియోగదారులు సంస్థ నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ ఫ్రాడ్స్, థర్డ్ పార్టీ స్టోర్లలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఆపిల్ సొంత బ్రాంచ్ ఏర్పాటు చేయడంతో క్వాలిటీ ప్రొడక్ట్స్ లభిస్తాయని భావిస్తున్నారు.డిఫాల్ట్ ప్రొడక్ట్స్ డెలివరీ తీసుకున్న క్రమంలో ఎక్స్ఛేంజ్, రీఫండ్ రాక చాలా మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
