తెలంగాణ

Cm Revanth Reddy : జాతి ప్రయోజనాల్లో రాజకీయాలకు చోటు లేదు : సీఎం రేవంత్

దేశభద్రత, జాతి ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో రాజకీయాలకు చోటు లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు.నగరంలోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) వార్షిక సదస్సుకు హాజరైన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్‌‌కు విచ్చేసిన దేశవిదేశీ అతిథులకు ముందుగా స్వాగతం పలికిన సీఎం.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అప్పటివరకు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.