తెలంగాణ

Cm Revanth Reddy : జాతి ప్రయోజనాల్లో రాజకీయాలకు చోటు లేదు : సీఎం రేవంత్

దేశభద్రత, జాతి ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో రాజకీయాలకు చోటు లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు.నగరంలోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) వార్షిక సదస్సుకు హాజరైన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశభద్రత, జాతి ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో రాజకీయాలకు చోటు లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు.నగరంలోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరుగుతున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) వార్షిక సదస్సుకు హాజరైన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్‌‌కు విచ్చేసిన దేశవిదేశీ అతిథులకు ముందుగా స్వాగతం పలికిన సీఎం.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అప్పటివరకు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

మూడు ఆర్థిక జోన్లుగా తెలంగాణ..

రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణను 3 ఆర్థిక జోన్లుగా (క్యూర్, ప్యూర్, రేర్) విభజించామని సీఎం పేర్కొ్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాన్ని 'క్యూర్' డివైడ్ చేసి అక్కడ సేవా రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) పరిధిలోని ప్రాంతాన్ని 'ప్యూర్' డిసైడ్ చేసి అక్కడ తయారీ రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతాన్ని 'రేర్'గా గుర్తిస్తూ అక్కడ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

రహదారులు, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత..

కాంగ్రెస్ ప్రభుత్వంలో రహదారులతో పాటు వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి, టిమ్స్ (TIMS) తదితర ఆసుపత్రుల ద్వారా కొత్తగా 8 వేల పడకలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దేశ భద్రత, జాతి ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావులేదని, కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్రం, నిపుణుల మద్దతు అవసరం అన్నారు. తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు డిసెంబరు 7, 8, 9 తేదీల్లో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' నిర్వహించనున్నట్టు తెలిపారు.

తర్వాత చదవండి