National

Delimitaion : రేపు లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు.. ఇండియా కూటమికి క్రాస్ ఓటింగ్ భయం?

కేంద్రంలోని బీజేపీ సర్కార్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ,మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాగైనా పాస్ చేయించాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ సాధ్యం చేసి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్నది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు డీలిమిటేషన్ పూర్తి చేసి దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ (జమిలి) కలను సాకారం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది.ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపుతూ రేపు లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. రేపు ఉదయం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.దీనికి తోడు డీలిమిటేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును సైతం ప్రవేశపెట్టునున్నారని సమాచారం.