సినిమా
Tollywood: రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అడవి శేష్..
Tollywood: టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. ఆయనకి, కథ-స్క్రీన్ ప్లే మీద మంచి పట్టున్న సంగతి తెలిసిందే. అందుకే, శేష్ నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి శేష్ దర్శకనటుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి పనిచేయబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.
