Tollywood: టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. ఆయనకి, కథ-స్క్రీన్ ప్లే మీద మంచి పట్టున్న సంగతి తెలిసిందే. అందుకే, శేష్ నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి శేష్ దర్శకనటుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి పనిచేయబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది.
తెలుగులో ఇప్పటికే నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు రాహుల్ రవీంద్రన్. హిట్, ఫ్లాప్స్ పక్కన పెడితే, ఆనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో రష్మిక మందన్న లాంటి స్టార్ హీరోయిన్ సినిమా చేసే ఛాన్స్ అంటే రాహుల్ టాలెంట్‌ను వాళ్ళు ఎంతగా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే అడవి శేష్ కూడా రాహుల్ రవీంద్రన్‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వీరి కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల్లో కూడా సహజంగానే అంచనాలు మొదలవుతాయి. ఇక్కడ, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కోసం రాహుల్ ఒక విభిన్నమైన కథాంశాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, సినిమా జానర్, హీరోయిన్, ఇతర నటీనటులు, నిర్మాణ సంస్థ వంటీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాహుల్ రవీంద్రన్ గతంలో ‘చి ల సౌ’, ‘మన్మథుడు 2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అడివి శేష్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం, అడివి శేష్ ‘గూఢచారి 2’ (జీ2) సినిమాను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత, రాహుల్ రవీంద్రన్ మూవీను పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రాబోతుందని సమాచారం.
