సినిమా
Tollywood: ‘మైసా’ కోసం వందేమాతరం శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ!
Tollywood: మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి అరుదైన కాంబినేషన్ మళ్ళీ మన ముందుకు రాబోతోంది. దాదాపు, 29 ఏళ్ల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కలిసి ఓ సినిమా కోసం పనిచేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ సినిమానే ‘మైసా’. ఈ సినిమా కోసం వీరిద్దరు చేతులు కలపడం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.
