సినిమా

Tollywood: వృష కర్మ ట్రైలర్ అప్‌డేట్‌తో అన్నిటికి చెక్

Tollywood: అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన మైథలాజికల్ మిస్టిక్ ఠ్రిల్లర్ మూవీ వృష కర్మ. తండేల్ తర్వాత చైతూ నుంచి వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. పైగా నాగ చైతన్య ఇప్పటి వరకూ చేయని జానర్ సినిమా కావడం కూడా విశేషం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులను చేరువ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తుండగా, రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందంటూ పుకార్లు మొదలయ్యాయి. దీనికి, తాజాగా ట్రైలర్ అప్‌డేట్‌తో చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.