Tollywood: అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన మైథలాజికల్ మిస్టిక్ ఠ్రిల్లర్ మూవీ వృష కర్మ. తండేల్ తర్వాత చైతూ నుంచి వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. పైగా నాగ చైతన్య ఇప్పటి వరకూ చేయని జానర్ సినిమా కావడం కూడా విశేషం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులను చేరువ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తుండగా, రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందంటూ పుకార్లు మొదలయ్యాయి. దీనికి, తాజాగా ట్రైలర్ అప్‌డేట్‌తో చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.
నవంబర్ 25న గ్రాండ్‌గా వృష కర్మ సినిమా థియోట్రికల్ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. వేదిక ఇంకా ఎక్కడో కన్‌ఫర్మ్ చేయనప్పటికీ, ఇదే ట్రైలర్ అప్‌డేట్‌లో డిసెంబర్ 4న సినిమా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నామని ఎక్స్ ద్వారా వెల్లడించింది. దీంతో, జోరుగా ప్రచారం జరుగుతున్న పుక్కార్లకి చెక్ పెట్టినట్టైంది. ఇప్పటికే, సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
తండేల్ సినిమాతో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కూడా వరుస సక్సెస్‌లలో ఉంది. సినిమాకి ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక, దర్శకుడు కార్తీక్ వర్మ దండు అద్భుతమైన కథ-కథనాలతో సినిమాను రూపొందించాడని పాన్ ఇండియా వైడ్‌గా వృష కర్మ భారీ హిట్ సాధించబోతుందని నమ్మకంగా ఉన్నారు.
నితిన్-చైతుల మధ్య గట్టి పోటీ..
గత కొన్నేళ్ళుగా హిట్ ఎలా ఉంటుందో చూడని మన యూత్ స్టార్ నితిన్, నాని సమర్పణలో అలియాస్ రుక్మిణి అనే రొమాంటిక్ లవ్ స్టోరీని చేశాడు. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో దీప్తి గంట నిర్మించారు. అయితే, డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో అలియాస్ రుక్మిణి మీద కూడా అంచనాలు బాగా పెరిగాయి. దీనికి, పూర్తి భిన్నమైన కథతో వృష కర్మ రూపొందింది. ఈ రెండు సినిమాల మధ్య గట్టి నెలకొంది. మరి,బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సత్తా చాటుతుందో చూడాలి.
