క్రైమ్
Accident : అనంతగిరిలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. బుగ్గరామేశ్వరం సమీపంలో ఓ మూల మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ యాక్సిడెంట్లో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్యాసింజర్స్ అక్కడికక్కడే మృతిచెందారు. పెండ్లి మడుగు గ్రామం నుంచి కేరెళ్లి వైపు వెళ్తుండగా ఈ విషాదకర ఘటన సంభవించింది. లారీ బలంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
