తెలంగాణ

TG: గాంధీ కుటుంబంపై మాట్లాడే స్థాయి నీది కాదు.. కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్!

TG: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, నాగార్జున సాగర్ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదని ఆయన గుర్తుచేశారు. "సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంది. ఆమె తెలంగాణ ఇవ్వడం వల్లే మీకు పదవులు వచ్చాయి.. ఆస్తులు సంపాదించుకున్నారు. అలాంటి గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి నీది కాదు" అంటూ కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.