తెలంగాణ
VCSajjanarFireDGCharge: తెలంగాణ ఫైర్ డీజీగా సజ్జనార్ బాధ్యతలు.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్!
తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర పౌర రక్షణ విభాగం (Fire, Disaster Response, Emergency & Civil Defence) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VCSajjanar) గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో, కొంత విరామం అనంతరం నానక్‌రామ్‌గూడలోని ప్రధాన కార్యాలయంలో నిర్ణీత ముహూర్తంలో సజ్జనార్ చార్జ్ తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వీసీ సజ్జనార్, తనపై వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు.
