చిత్రం లేదు
తెలంగాణ

VC Sajjanar: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ బదిలీ అయితే పోలీస్ శాఖలోనే సెలబ్రేషన్సా? అసలేం జరిగింది?

VC Sajjanar: తెలంగాణ పోలీసు శాఖలో ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీల్లో వీసీ సజ్జనార్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) వంటి అత్యంత కీలక బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి, ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా ప్రభుత్వం బదిలీ చేయడం వెనుక పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా ప్రజల చేత చప్పట్లు కొట్టించుకున్న ఆఫీసర్ బదిలీ అయితే, ఒకవైపు వీడ్కోలు సభలు జరుగుతుండగానే.. మరోవైపు పోలీసు శాఖలోని ఓ వర్గంలో అంతర్గతంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయనే ప్రచారం ఇప్పుడు సంచలనం రేపుతోంది.