స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Water War : తెలంగాణలో నీళ్ల మంటలు.. ఏపీ నీళ్ల దోపిడీకి దొంగల వ్యవస్థ సపోర్టు?
ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారి తీసింది.డెడ్ స్టోరేజ్‌లో నీరు ఉన్నప్పటికీ టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో భారీ సొరంగం నిర్మించి, ఎలాంటి అనుమతులు లేకుండా, కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా 90 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే కుట్ర చేస్తోంది. ఇప్పటికే శ్రీశైలానికి కన్నం వేసి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తోడుకుంటున్న ఆంధ్రా పాలకులు ఇప్పుడు ఏకంగా నాగార్జున సాగర్‌కే కన్నం వేస్తున్నారు. తాగునీటి పథకం పేరుతో పైప్‌లైన్ నిర్మించి 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది.
