తెలంగాణ

Weather Alert: ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం.. నేటి వాతావరణ శాఖ రిపోర్ట్ ఇదే!

 బంగాళాఖాతంలో నెలకొన్న తూర్పు గాలుల ద్రోణి ప్రభావంతో నేడు (మంగళవారం) తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) కీలక సూచనలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీని ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.