National
Wedding Season 2026: దేశంలో పెళ్లిళ్ల సందడి.. సంచలన నివేదిక!
దేశవ్యాప్తంగా మళ్లీ పెళ్లిళ్ల సందడి ఘనంగా మొదలైంది. రాబోయే 23 రోజుల వ్యవధిలో దేశంలో ఏకంగా 52 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వివాహాల సీజన్లో దాదాపు రూ.7.5లక్షల కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అఖిల భారత వర్తక సమాఖ్య (CAIT) తాజా సర్వేలో అంచనా వేసింది. నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగే ఈ వివాహ ముహూర్తాల నేపథ్యంలో దేశంలోని 25 రాష్ట్రాల్లో 300 మంది ప్రముఖ వ్యాపారులు, 550 వర్తక సంఘాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సీఏఐటీ ఈ సమగ్ర నివేదికను రూపొందించింది.
