టాప్ న్యూస్

WhatsApp Cloud Storage : వాట్సాప్ క్లౌడ్.. మొబైల్‌లో స్టోరేజీ సమస్యకు చెక్!

మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ సరిపోక చాలా మంది కొత్త ఫోన్లు తీసుకుంటుంటారు. లేదంటే ఎక్స్‌టర్ననల్ స్టోరేజీ కోసం మొమెరీ కార్డు, పెన్ డ్రైవ్ వంటి డివైజ్‌లు ఉపయోగిస్తుంటారు. అందులోని డేటాను బదిలీ చేసి ఫోన్ మొమెరీ క్లీన్ చేస్తుంటారు.వాట్సాప్ చాట్, వీడియోస్, ఫొటోస్ స్టోరేజ్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో గూగుల్ డ్రైవ్, ఐక్లోడ్ మీద ఆధారపడాల్సిన పనిలేకుండా వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.వాట్సాప్ తన సొంత క్లౌడ్ సర్వర్లలోనే చాట్ బ్యాకప్ చేసుకునే కొత్త ఫీచర్‌ను తెస్తోంది. తాజాగా ఆండ్రాయిడ్ (వెర్షన్ 2.26.46.4), ఐఓఎస్ (వెర్షన్ 26.45.10.71) బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'చాట్ బ్యాకప్' విభాగంలో మార్పులు రానున్నాయి. యూజర్లు తమ బ్యాకప్ ప్రొవైడర్‌గా ‘గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌’కు బదులుగా 'వాట్సాప్ క్లౌడ్ స్టోరేజ్' (WhatsApp Cloud Storage) ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.