టాప్ న్యూస్

WhatsApp Cloud Storage : వాట్సాప్ క్లౌడ్.. మొబైల్‌లో స్టోరేజీ సమస్యకు చెక్!

మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ సరిపోక చాలా మంది కొత్త ఫోన్లు తీసుకుంటుంటారు. లేదంటే ఎక్స్‌టర్ననల్ స్టోరేజీ కోసం మొమెరీ కార్డు, పెన్ డ్రైవ్ వంటి డివైజ్‌లు ఉపయోగిస్తుంటారు. అందులోని డేటాను బదిలీ చేసి ఫోన్ మొమెరీ క్లీన్ చేస్తుంటారు.

మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ సరిపోక చాలా మంది కొత్త ఫోన్లు తీసుకుంటుంటారు. లేదంటే ఎక్స్‌టర్ననల్ స్టోరేజీ కోసం మొమెరీ కార్డు, పెన్ డ్రైవ్ వంటి డివైజ్‌లు ఉపయోగిస్తుంటారు. అందులోని డేటాను బదిలీ చేసి ఫోన్ మొమెరీ క్లీన్ చేస్తుంటారు.వాట్సాప్ చాట్, వీడియోస్, ఫొటోస్ స్టోరేజ్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో గూగుల్ డ్రైవ్, ఐక్లోడ్ మీద ఆధారపడాల్సిన పనిలేకుండా వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

చాట్ బ్యాకప్..

వాట్సాప్ తన సొంత క్లౌడ్ సర్వర్లలోనే చాట్ బ్యాకప్ చేసుకునే కొత్త ఫీచర్‌ను తెస్తోంది. తాజాగా ఆండ్రాయిడ్ (వెర్షన్ 2.26.46.4), ఐఓఎస్ (వెర్షన్ 26.45.10.71) బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'చాట్ బ్యాకప్' విభాగంలో మార్పులు రానున్నాయి. యూజర్లు తమ బ్యాకప్ ప్రొవైడర్‌గా ‘గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌’కు బదులుగా 'వాట్సాప్ క్లౌడ్ స్టోరేజ్' (WhatsApp Cloud Storage) ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

భద్రతలో కఠిన నిబంధనలు..

భద్రత విషయంలో వాట్సాప్ అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. సొంత సర్వర్లలో స్టోర్ అయ్యే ప్రతి బ్యాకప్‌కు ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’ (End-to-End Encryption) తప్పనిసరి చేసింది. అనగా యూజర్ల చాట్‌లను వాట్సాప్ , మెటా చూడలేవు. బ్యాకప్ సెటప్ చేసుకునే సమయంలోనే పాస్‌కీ (Passkey) ఇవ్వాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్ లేదా 64-అంకెల ఎన్‌క్రిప్షన్ కీ ద్వారా మీ డేటాను లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్ అంతా మీ ఫోన్‌లోనే జరుగుతుంది.

ఫ్రీ అండ్ పెయిన్ ప్లాన్స్..

'వాట్సాప్ క్లౌడ్ స్టోరేజ్' కింద ప్రతి వినియోగదారునికి వాట్సాప్ 2GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తోంది. టెక్స్ట్ మెసేజ్‌లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు బ్యాకప్ చేసుకోవడానికి మాత్రమే ఇది సరిపోతుంది. మీ చాట్ బ్యాకప్ పరిమాణం 2GB దాటితే, అదనపు స్టోరేజ్ కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ఎంచుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగా 'వాట్సాప్ ప్లస్' (WhatsApp Plus) ద్వారా 100GB వరకు, అలాగే 'మెటా వన్' (Meta One) ప్లాన్ల ద్వారా 2TB నుండి 4TB వరకు స్టోరేజ్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ సబ్‌స్క్రిప్షన్ గడువు ముగిస్తే నాలుగు నెలల (120 రోజులు) తర్వాత అదనపు డేటా తొలగించబడుతుంది. వాట్సాప్ తెచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ డ్రైవ్, ఐఫోన్ వినియోగదారులు యాపిల్ ఐక్లౌడ్‌పై ఆధారపడాల్సిన అవసరం ఇక ఉండబోదని టెక్ నిపుణులు చెబుతున్నారు.

తర్వాత చదవండి